పయనించే సూర్యుడు న్యూస్ జూలై 4 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్ . జిల్లావిద్యాశాఖ అధికారి శ్రీకాకుళం, ఆదేశాల మేరకు డైట్ అధ్యాపక బృందం పలాస మండలంలో వివిధ ప్రాథమిక పాఠశాలలను ఉన్నత పాఠశాలను శుక్రవారం నాడు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అకాడమిక్, పరిపాలనా పరమైన, మధ్యాహ్న భోజనం సంబంధించి అంశాలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు చిన్న బాడమ్, ఉదయపురం పలాస కాశీబుగ్గ గరుడకండి , పి ఎన్ ఆర కాలనీ, అంబుసోలి ,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను వారు పరిశీలించారు. పాఠశాలను పనితీరు విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలు బోధనా విధానాలు విద్యా ప్రమాణాలు మధ్యాహ్న భోజన పథకం ఉపాధ్యాయులు విద్యార్థుల హాజరు ప్రభుత్వ మార్గదర్శకాల అమలు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి పాఠశాలలో తరగతి గదులను సందర్శించి, విద్యార్థుల అభ్యసన స్థాయిని పరీక్షించారు. ఉపాధ్యాయుల బోధిస్తున్న తీరును బోదనలో ఉపయోగిస్తున్న టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ లను విద్యార్థుల నోటు పుస్తకాలను, రికార్డులు వార్షిక ప్రణాళికలు పాఠ్యాంశాల పురోగతి , విద్యార్థుల క్రమశిక్షణ వంటి అంశాలను,పాఠశాలల పరిశుభ్రత ,తాగునీటి సదుపాయము మరుగుదొడ్లు నిర్వహణ పాఠశాల ఆవరణ పరిశుభ్రత ,మొక్కల సంరక్షణ మౌలిక వసతులను పరిశీలించారు. పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగ్గా ఉన్నాయని ఉపాధ్యాయులు బాధ్యతగా విధులు నిర్వహిస్తున్నారని డైట్ బృందం సంతృప్తి వ్యక్తం చేసింది ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేసేందుకు ఉపాధ్యాయులు ఇదే తరహా కృషిని కొనసాగించాలని సూచించారు. ఈ తనిఖీలు లో గుర్తించిన విషయాలను మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు ,సత్యనారాయణ తో చర్చించారు. ఈ తనిఖీల్లో డైట్ అధ్యాపక బృందం ఏ వేణుగోపాల్ ,జి .ఇందువదన .,ఎస్ మురళి, కె.రాజీవ్ కుమార్ ఎస్ రమణ పాల్గొన్నారు.