సంచార కులాలకు తీవ్రమైన అన్యాయం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు

సంచార జాతుల అభివృద్ధి మండలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోరంట్ల శ్రీనివాసరావు

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జూన్ 2 జగయ్యపేట్ట మండలం చిల్లకల్లు గ్రామంలోని సంచార జాతుల అభివృద్ధి మండలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోరంట్ల శ్రీనివాసరావు ది1/6/2024 న స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సంచార కులాలకు సంబంధం లేని కొన్ని కులాలను సంచార కులాల్లో చేర్చడానికి గత ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం పోటీపడి మరీ దిగ్విజంగా పూర్తి చేశారు అన్ని రాజకీయ పార్టీలో ఉన్న సంచార కులాల నాయకులారా కుల పెద్దలారా ఆలోచించండి ముఖ్యంగా సంచార కులాల మీద అనేకమైన కమిషన్లు వేసి ఎన్ టి/ డి ఎన్ టి /ఎస్ ఎన్ టి నామకరణ చేసి ఈ కులాలను పూర్తిగా ప్రభుత్వ గజిట్లో చేర్చకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కులాలతో చెలగాలటం ఆడుతున్నారు ఈ సంచార కులాల పైన కేంద్ర ప్రభుత్వం డిఎన్టి బోర్డు (కార్పొరేషన్) ప్రకటించి చట్టబద్ధ కల్పించినప్పుడు రాష్ట్రంలో కూడా డిఎన్టి బోర్డు (కార్పొరేషన్) ఉండాలి కదా అలా కాకుండా కేంద్రంలో సంచార కులాలు డి ఎన్ టి లు కాగా రాష్ట్రాల్లో మాత్రం ఎం బీ సీ లు ఇక్కడే మనకు తీవ్రమైన అన్యాయం జరిగింది ఆంధ్రప్రదేశ్లో బిక్కురాంజీ విదాతే కమిషన్ ద్వారా గుర్తించబడ్డ 36 కులాలను 2016 లో ఎం బీ సి కార్పొరేషన్ పెట్టినప్పుడు పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది మేము ఎంబిసిలం కాదు మేము డిఎన్టియులము మా మీద అనేకమైన కమిషన్లు వేసి మమ్మల్ని డిఎన్టి కులాలు గా గుర్తించారు కాబట్టి మా యందు దయవుంచి ఎంబీసీ కార్పొరేషన్ అనే పేరు మార్చి డిఎన్టి కార్పొరేషన్ పెట్టమని అడగడం జరిగింది అప్పటి పాలకులు మన మాటలు పెడచెవిన పెట్టడం మూలంగా ఇప్పుడు ఎంబీసీలో ఉన్న కులాలకు డిఎన్ డి సర్టిఫికెట్ పొందటానికి అర్హులుగా గత పాలకులు తీర్మానం చేసి పంపిస్తే ఆ తీర్మానాన్ని అంగీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ కి జీవో పాస్ చేయడం జరిగింది దీని మూలంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సంచార కులాలు తీవ్రంగా నష్టపోతున్నాయి డిఎన్టి లిస్టులో ఉన్న మేదర కులం ఈరోజు డిఎన్టి కుల సర్టిఫికెట్ లిస్టులో లేకపోవడం చాలా బాధాకరమైన విషయం అలాగే ఇంకా కొన్ని సంచార కులాలకు ఈరోజు వరకు కూడా కుల సర్టిఫికెట్ ఇవ్వని పరిస్థితి సంచార కులాలకు జరుగుతున్న అన్యాయాలు పై ఖచ్చితంగా న్యాయపోరాటం చేస్తాం డిఎన్టి కానీ కులాలకు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో డిఎన్టియుగా గుర్తించి కుల సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుంది త్వరలోనే రాష్ట్రంలో ఉన్న సంచార కులాల నాయకులను పెద్దలను కలుపుకొని న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం ఈ పాపానికి ఒడిగట్టిన రాజకీయ పార్టీలను తీవ్రంగా హెచ్చరిస్తున్నాం భారతదేశానికి స్వతంత్రాన్ని సిద్ధింప చేసిన ఈ సంచార కులాలు భారతదేశ స్వతంత్రం కోసం మానప్రాణాలు త్యాగాలు చేసిన ఈ సంచార కులాలు ఇప్పటికీ భారతదేశం యొక్క సంస్కృతి సంప్రదాయాలను కులవృత్తులను కుల కళలను కాపాడుతున్న ఈ సంచార కులాలకు జరుగుతున్న తీవ్రమైన నష్టాన్ని అన్యాయాన్ని ఏ రాజకీయ పార్టీలు మీ స్వార్థం కోసం ఈ సంచార కులాలకు అన్యాయం చేశాయో ఆ పార్టీలన్నీ కూడా కేంద్రానికి మరొకసారి మీరు చేసిన తప్పులు తెలియజేసి మా సంచార కులాలకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *