ప్రైవేటు వద్దు అంగన్వాడి ముద్దు..

అమ్మ మాట అంగన్వాడి బాట.

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ మే 31 మామిడిపెల్లి లక్ష్మణ్ రాయికల్ మండలంలోని వడ్డెర కాలని గ్రామ పంచాయతీలో సర్పంచ్ బోదాసు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమాన్ని నిర్వహించారు.. ఈ సందర్భంగా సర్పంచ్ చంద్రశేఖర్ పిల్లల తల్లుల సమావేశంలో మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో కి పిల్లలను పంపాలని ప్రీస్కూల్ విద్య పిల్లల భవిష్యత్తుతో పునాదిలా ఉంటుందని వారి మానసిక ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడుతుందని మరియు పిల్లల మేధో వికాసం మెరుగుపడడానికి అంగన్వాడీ ప్రీస్కూల్ విద్య చాలా వరకు పిల్లలను మంచి మార్గంలో నడవడానికి ఎంతగానో తోడ్పడుతుందని ప్రైవేట్ స్కూల్ కు ధీటుగా అంగన్వాడి బోధన ఉంటుందని, ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి దివ్య జ్యోతి, వార్డు సభ్యులు రాజేశ్వరి, అంగన్వాడి టీచర్ బియ్యని సుజాత, కారోబార్ జలంధర్, వివో ఏ రోజా, కమల, లతికా, రమేష్ , విజయ, లక్ష్మీ పిల్లల తల్లులు, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *