కాంగ్రెస్ గూటికి ఉమ్మడి వెంకట్రావు

పయనించే సూర్యుడు న్యూస్, మే 20 (ఏలేశ్వరం మండలం రిపోర్టర్ ఏ శివాజీ) : భారతీయ జనతా పార్టీలో జిల్లా ఉపాధ్యక్షులుగా పని చేసిన ఉమ్మడి వెంకట్రావు ఇటీవల పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ నేపథ్యంలో మంగళవారం విజయవాడ కాంగ్రెస్ కార్యాలయంలో పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానించారు. 2019లో కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన వెంకట్రావు పార్టీలో పలు కీలక పదవులను అలంకరించి ప్రత్తిపాడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా బరిలో దిగారు. తధానంతరం రాజకీయ పరిణామాలు దృశ్య కాంగ్రెస్ పార్టీని వీడి భాజపాలో పనిచేశారు. వ్యక్తిగత కారణాలు దృశ్య ఇటీవల భాజపాను వీడాల్సి వచ్చింది. కాగా మాజీ కేంద్రమంత్రి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు మల్లిపూడి మంగపతి పల్లంరాజు ప్రోత్సాహంతో మళ్లీ తన సొంత గూటికి చేరినట్లు చెప్పారు. ఆయనతోపాటు నియోజకవర్గాల్లోనే రౌతులపూడి మండలం కోట శ్రీను, రామగుర్తి సూర్యనారాయణ, యనమల రాజా, దంత శెట్టి చంద్రశేఖరు, గోన్ ఆఫ్ శ్రీనివాస్, యనమల కిరణ్, ఈ పి రమణ తదితరులను వైయస్ షర్మిల రెడ్డి కాంగ్రెస్ అందువలన కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ఇంచార్జ్ గణేష్ యాదవ్, జాయింట్ సెక్రెటరీ పాలక్ వర్మ, పీసీసీ కాకినాడ అధ్యక్షులు మాదేపల్లి సత్యానందరావు, పెద్దాపురం ఇంచార్జ్ మరకల సూరిబాబు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *