చేయూత’ లబ్ధిదారులకు లైవ్ ఆథెంటికేషన్ ప్రారంభించిన మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అన్నం లావణ్య అనిల్

పయనించే సూర్యుడు కోరుట్ల, మే20: కోరుట్ల పట్టణంలోని 26వ వార్డులో చేయూత లబ్ధిదారుల కోసం ముఖచిత్ర ధ్రువీకరణ (లైవ్ ఆథెంటికేషన్) ప్రక్రియను మాజీ మున్సిపల్ చైర్మన్ అన్నం లావణ్య అనిల్ అధికారికంగా ప్రారంభించారు. మంగళవారం వార్డు పరిధిలోని లబ్ధిదారుల ఇళ్ల వద్దకే నేరుగా వెళ్లి ఈ ప్రక్రియను ఆమె పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అన్నం లావణ్య అనిల్ మాట్లాడుతూ.. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సకాలంలో అందాలనే ఉద్దేశంతో ఈ ముఖచిత్ర ధ్రువీకరణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. వృద్ధులు, మహిళలు ఆఫీసుల చుట్టూ తిరిగే ఇబ్బంది లేకుండా అధికారులతో కలిసి నేరుగా ప్రజల వద్దకే వెళ్లి లైవ్ ఆథెంటికేషన్ పూర్తి చేస్తున్నామని పేర్కొన్నారు. వార్డులోని చేయూత లబ్ధిదారులు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ ధ్రువీకరణను వేగంగా పూర్తి చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, వార్డ్ ఆఫీసర్ మధు లబ్ధిదారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *