మున్నూరు కాపు రాష్ట్ర మున్నూరు కాపు సంఘం కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన మండల మున్నూరు కాపు సంఘ నాయకులు ఘనంగా సన్మానించి.

పయనించే సూర్యుడు న్యూస్ :మే /21:నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి :సాయిరెడ్డి బొల్లం :కరీంనగర్ జిల్లా మున్నూరు కాపు ఆపద్బంధు, మాజీ ఎమ్మెల్యే శ్రీ బొమ్మ వెంకన్న కుమారుడు శ్రీ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన సందర్భంగా మండల మున్నూరు కాపు సంఘ నాయకులు ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, శ్రీ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, నాయకత్వంలో మున్నూరు కాపు సమాజ అభివృద్ధి, సంక్షేమం మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు: మాజీ సర్పంచ్ శ్రీ చల్ల నారాయణ పటేల్, మాజీ ఎంపీటీసీ శ్రీ యాస తిరుపతి పటేల్, సర్పంచ్ శ్రీ నాయిని నవీన్ పటేల్, మున్నూరు కాపు మండల ప్రధాన కార్యదర్శి శ్రీ సింగరి శ్రీనివాస్ పటేల్, మున్నూరు కాపు మండల ప్రచార కార్యదర్శి శ్రీ బత్తుల స్వామి పటేల్, పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *