ఉపముఖ్యమంత్రి భట్టి సమావేశాన్ని విజయవంతం చేయండి

* ఐఎన్టీయూసీ కేంద్ర కార్యదర్శి గడ్డం తిరుపతి యాదవ్ పిలుపు

పయనించే సూర్యుడు న్యూస్ ప్రతినిధి: పెద్దపల్లి జూన్ 13: సింగరేణిలో కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు పొంది, మెడికల్ పరీక్షలు పూర్తిచేసుకుని నియామక పత్రాల కోసం ఎదురుచూస్తున్న దాదాపు 400 మంది అభ్యర్థులకు నియామక పత్రాల జారీతో పాటు మెడికల్ బోర్డు అంశంపై శనివారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు శ్రీరాంపూర్ పర్యటన సందర్భంగా నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఐఎన్టీయూసీ కేంద్ర కమిటీ కార్యదర్శి గడ్డం తిరుపతి యాదవ్ పిలుపునిచ్చారు.ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ బి. జనక్ ప్రసాద్ ఆదేశాల మేరకు ఆర్జీ-3 ఓసీ-1 ఆపరేషన్స్ సైట్ కార్యాల ఈ సందర్భంగా గడ్డం తిరుపతి యాదవ్ మాట్లాడుతూ, ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ కృషి ఫలితంగా కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు పొంది, మెడికల్ పరీక్షలు పూర్తిచేసి నియామక పత్రాల కోసం ఎదురుచూస్తున్న సుమారు 400 మందికి నియామక పత్రాల జారీపై స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశముందని తెలిపారు. అలాగే మెడికల్ బోర్డు పునఃప్రారంభం అంశంపై కూడా కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందన్నారు.శనివారం శ్రీరాంపూర్ ఏరియా మంచిర్యాలలోని పద్మనాయక కల్యాణ మండపంలో నిర్వహించే ఈ సభకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్, ప్రేమ్ సాగర్ రావు తదితర కోల్‌బెల్ట్ ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారని పేర్కొన్నారు.ఈ సమావేశంలో 6 గ్యారంటీల అమలు, మెడికల్ బోర్డు పునఃప్రారంభం, కార్మికుల సొంతింటి కల సాకారం, పెర్క్స్‌పై ఐటీ మాఫీ, మారుపేర్ల మార్పు తదితర పెండింగ్ సమస్యల పరిష్కారానికి దిశానిర్దేశం లభిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. కావున సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని గడ్డం తిరుపతి యాదవ్ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *