త్యాగానికి ప్రతీక బక్రీద్‌

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ మే 29 మామిడిపెల్లి లక్ష్మణ్ త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్‌ పండుగను ముస్లింలు గురువారం రోజున రాయికల్ పట్టణం లో ఈద్గా లో ఘనంగా జరుపుకున్నారు. త్యాగానికి ప్రతీక బక్రీద్‌ రాయికల్ పట్టణంలోని ఈద్గా ప్రాంగణంలో ప్రార్థనలు చేసిన ముస్లింలు త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్‌ పండుగను ముస్లింలు సోమవారం ఘనంగా జరుపుకున్నారు. హజ్రత్‌ ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. స్వార్థం, అసూయ, రాగద్వేషాలను విడిచిపెట్టి మానవులలో త్యాగనిరతిని వ్యాపింప చేయడమే బక్రీద్‌ పండుగ సారాంశమని మత పెద్దలు తెలిపారు. అన్ని గుణాలలో దాణగుణమే ఉత్తమమైనదని హజ్రత్‌ ఇబ్రహీం నిరూపించారని, సకల మానవాళికి హజ్రత్‌ ఇబ్రహీం దానగుణం అనుసరనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో ముస్లిం కమిటీ అధ్యక్షులు అబ్దుల్ నయీమ్ , ఉపాధ్యక్షులు మొహమ్మద్ షాకీర్, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ ముబీన్, ఈద్గా అధ్యక్షులు మజీద్ ఆలం, అబ్దుల్ నబీ ముస్తాక్ అహ్మద్, ముజాఫర్,సయ్యద్ రసూల్ ,సోహెల్ మన్సూర్, ఫయాజ్ అలీ ,రషీద్, మసీదుల ఇమాములు ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *