బి జె వై ఎమ్ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడిగా :- బెస్త నాగరాజు నియామకం.

పయనించే సూర్యుడు మే 29 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. కర్నూలు జిల్లా భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) జిల్లా ఉపాధ్యక్షుడిగా బెస్త నాగరాజు నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా పార్టీ నాయకత్వం ఆయన నియామకాన్ని అధికారికంగా ప్రకటించింది. పార్టీ కోసం ఆయన చేసిన అవిశ్రాంత కృషిని, యువతలో ఆయనకున్న పట్టును గుర్తించి అధిష్టానం ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి , బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు సునీల్ రెడ్డి, బిజెపి అధ్యక్షుడు అక్కమ్మ తోట రామకృష్ణ , బీజేవైఎం జిల్లా అధ్యక్షులు కేశవరామ్ చౌదరి ఈ కీలక బాధ్యతలను అప్పగించారు.ఈ సందర్భంగా బెస్త నాగరాజు మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో జిల్లా ఉపాధ్యక్ష పదవిని కట్టబెట్టిన బీజేపీ, బీజేవైఎం అగ్ర నాయకత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో యువతను సంఘటితం చేస్తూ, పార్టీ బలోపేతానికి నిరంతరం శ్రమిస్తానని స్పష్టం చేశారు. కర్నూలు జిల్లాలో నిరుద్యోగ సమస్యలపై, ప్రజా సమస్యలపై యువమోర్చా ఆధ్వర్యంలో పోరాటాలు ఉధృతం చేస్తానని పేర్కొన్నారు.ఈ నియామకం పట్ల కర్నూలు జిల్లా బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మరియు యువజన నాయకులు బెస్త నాగరాజుకు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *