జనం న్యూస్ , జూన్ 7 ( జిల్లా ఇంచార్జ్ ) హుజురాబాద్ నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న దళితబంధు రెండో విడత నిధుల మంజూరును వేగవంతం చేయాలని దళితబంధు సాధన సమితి నాయకులు రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కి కరీంనగర్ ఆర్&బీ గెస్ట్ హౌస్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులకు దళితబంధు నిధులు అందేలా ఎస్సీ కార్పొరేషన్ అధికారులతో మాట్లాడి మంజూరు ప్రక్రియను వేగవంతం చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దళితబంధు సాధన సమితి నాయకుడు కొలుగూరి నరేష్ మాట్లాడుతూ 22 నెలలుగా నిధుల కోసం పోరాటం చేస్తున్న అర్హులైన లబ్ధిదారులకు వెంటనే నిధులు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. మంత్రి సానుకూలంగా స్పందించి సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రికి, హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్ ప్రణవ్ బాబుకు, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ కి దళితబంధు సాధన సమితి నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.