ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి

* రైస్ మిల్లుల వద్దా ధాన్యం 24 గంటల్లో అన్లోడింగ్ చేయాలి * -జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీమతి బి. ఎస్ లత

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ మే 30 మామిడిపల్లి లక్ష్మణ్ శుక్రవారం రాయికల్ మండలం మైతాపూర్ గ్రామం లోని ప్యాక్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రం రాయికల్ మండలం లోని శివమని రైస్ మిల్లును జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీమతి బి.ఎస్. లత ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రాలలో జరుగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేగంగా కొనుగోలు ప్రక్రియను కొనసాగించాలని అధికారులకు సూచించారు. కేంద్రాలలో హమలీలు తగిన సంఖ్యలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ధాన్యం లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేసి లారీలను ఆలస్యం లేకుండా మిల్లులకు తరలించాలని ఆదేశించారు. అలాగే ట్రక్ షీట్ నమోదు, ట్యాబ్ ఎంట్రీలు వంటి అన్ని డాక్యుమెంటేషన్ పనులను సమయానికి పూర్తి చేయాలని, ఎలాంటి పెండింగ్ లేకుండా చూడాలని స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాలలో పారదర్శకత పాటించడంతో పాటు రైతులకు సరైన సమాచారం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోలు సమయంలో తేమ శాతం, నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పరిశీలించాలని, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎటువంటి అవకతవకలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను హెచ్చరించారు. అనంతరం రైస్ మిల్లులను తనిఖీ చేసి మిల్లర్లు హమాలీల సంఖ్య పెంచాలని ధాన్యం తో వచ్చిన లారీలను 24 గంటల్లోగా అన్లోడ్ అయ్యే విధంగా చూడాలని రైస్ మిల్లర్లు అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకొని ధాన్యం కొనుగోళ్లు సజావుగా, వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ధాన్యం అన్లోడింగ్ లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నాగార్జున, నాయబ్ తహసీల్దార్ , సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది, కేంద్రల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా పౌర సంబంధాల అధికారి జగిత్యాల కార్యాలయం చే జారీ చేయనైనది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *