చేగుంటలో మెడికల్ షాపుల బంద్ సంపూర్ణం

పయనించే సూర్యుడు న్యూస్ మే 21 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ మెదక్ జిల్లా, చేగుంట మండలం, అఖిల భారత ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (ఏఐఓసీడీ ) పిలుపు మేరకు అక్రమ ఆన్‌లైన్ ఫార్మసీలు, కార్పొరేట్ సంస్థల భారీ డిస్కౌంట్ల విధానాలకు వ్యతిరేకంగా బుధవారం చేపట్టిన దేశవ్యాప్త మెడికల్ షాపుల బంద్ చేగుంట మండల కేంద్రంలో సంపూర్ణంగా విజయవంతమైంది. రాష్ట్ర కమిటీ ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ మెంబర్, మెదక్ జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు టి. రాజు, కార్యదర్శి సంగమేశ్వర్, కోషాధికారి శ్రీనివాస్ ఇచ్చిన పిలుపుతో చేగుంట ఏరియా అసోసియేషన్ పరిధిలోని అన్ని ప్రైవేట్ ఔషధ విక్రయ శాలల నిర్వాహకులు సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటించి తమ దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేయడంతో పట్టణంలోని మెడికల్ లైన్ నిర్మానుష్యంగా మారింది; ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ ఆన్‌లైన్ ఫార్మసీలలో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ (రసీదు) లేకుండా ఇష్టారాజ్యంగా మందులు విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారని, గతంలో కోవిడ్ సమయంలో తెచ్చిన జీఓ నంబర్ 220ని ప్రభుత్వం వెంటనే రద్దు చేసి ఆన్‌లైన్ అక్రమ విక్రయాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్య భద్రతను, లక్షలాది మంది కెమిస్టుల జీవనోపాధిని కాపాడేందుకు నిర్వహించిన ఈ బంద్‌కు స్థానిక ప్రజలు, రోగుల కుటుంబ సభ్యులు పూర్తిగా సహకరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *