శ్రీ ఆంజనేయ దేవాలనిర్మాణానికి 1,00,116/-రూపాయల విరాళం

బిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు - కానుగుల జోగయ్య కన్యాకుమారి

పయనించే సూర్యుడు, మే 21 2026, నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండల కేంద్రంలోని పురాతన ఆలయాని కూల్చి నూతనంగా నిర్మిస్తున్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి కానుగుల జోగయ్య కన్యాకుమారి ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులకు రూ,1 లక్ష 116 రూపాయల విరాళాన్ని బుధవారం ఆలయం కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు విరాళాధాతకు ధన్యవాదాలు తెలియజేసి ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. మండల బిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు కానుగుల జోగయ్య కన్యాకుమారి ఎలాంటి దేవాలయాల నిర్మాణ అభివృద్ధి కోసం ఎలాంటి సహాయమైన చేయడానికి ముందుంటానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చంద్రమోహన్ రెడ్డి, మాజీ సర్పంచ్ గుద్దేటి అరుణ ప్రభాకర్, దామోదర్ రెడ్డి, శ్రీదేవి, సింహారెడ్డి, మాజీ ఎంపీటీసీ జ్యోతి నిరంజన్, వార్డు సభ్యులు జంగిలి సునీత ఆనంద్, సిరసనగండ్ల శేఖర్, పిల్లి దేవేందర్, బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు జంగిలి ప్రవీణ్, బిట్టి సైదులు, టైలర్ వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *