అక్రమ వసూళ్లు చేస్తున్న నిత్య భారత్ గ్యాస్ ఏజెన్సీ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి – ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్

పయనించే సూర్యుడు న్యూస్ తేదీ 22 రూలర్ ప్రతినిధి బురిడీ బాసు అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలి మండలం తాసిల్దార్ కార్యాలయం ఆవరణంలో నిత్య భారత్ గ్యాస్ ఏజెన్సీ లబ్ధిదారుల నుండి అక్రమ వసూలను పాల్పడుతున్నరని తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదే డిమాండ్ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలి మండల కేంద్రంలో ఆన్లైన్ లో ఒక గేస్ బండ 937.5/- అమ్మాల్సి ఉండగా ఒక్కొక్క గ్యాస్ సిలిండర్ 1020 /-రూపాయలు చొప్పున అమ్ముతున్నారు ఒక గేస్ సిలిండర్పై అదనంగా 80 /-రూపాయలు అక్రమంగా వసూలు చేయడం అన్యాయమని తక్షణమే నిత్య భారత్ గ్యాస్ ఏజెన్సీ పై చట్టపరమైన చర్య తీసుకోవాలని ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ లబ్ధిదారులతో కలిసి అరకు వెళ్లి తాసిల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు ఆదివాసి ఏజెన్సీ ప్రాంతంలో అక్రమ వసువులకు పాల్పడుతున్న గ్యాస్ ఏజెన్సీ లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాడుగుల శ్రీలక్ష్మి భారత్ గ్యాస్ ఏజెన్సీ ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్న వారిని డెలివరీ చేయకుండా సిలిండర్లు అమ్ముకున్నారని ఆన్లైన్ బుకింగ్ చేసుకో లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్ ఇవ్వకుండా అక్రమంగా అమ్ముకున్నారని సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *