జర్నలిస్టుల సంక్షేమమే ఐజేయు ధ్యేయం

* యూనియన్ సభ్యులందరికీ ఇన్సూరెన్స్ పాలసీ * టి యు డబ్ల్యూ జే ఐజేయు అధ్యక్ష కార్యదర్శులు డా బూరం సంజీవ్ మహమ్మద్ అజీమ్.

పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి జూన్ 16 టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ యూనియన్ సభ్యులందరికీ ఇన్సూరెన్స్ పాలసీ చేయించమని టీ యు డబ్ల్యూ జే ఐజేయు మెట్ పల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు డా బూరం సంజీవ్, మహమ్మద్ అజీమ్ అన్నారు.సోమవారం రోజున మెట్ పల్లి ప్రెస్ క్లబ్ జర్నలిస్టులందరికీ ఇన్సూరెన్స్ పాలసీ చేయించిన సందర్భంగా అధ్యక కార్యదర్శులు డా బూరం సంజీవ్, మహమ్మద్ అజీమ్ లు మాట్లాడుతూ… జర్నలిస్టుల వృత్తిపరమైన ఒత్తిడి కారణంగా అనారోగ్యానికి గురవడమే కాకుండా కొంతమంది జర్నలిస్టులు మృతి చెందిన సంఘటనలు కూడా ఇటీవల చోటు చేసుకున్నాయన్నారు. ఈ నేపథ్యంలో జర్నలిస్టులు, వారి కుటుంబాల కోసం ఆరోగ్య భీమా, జీవిత బీమా సౌకర్యం కల్పించే అంశాన్ని ప్రథమ ప్రాధాన్యతగా గుర్తించి ఆ దిశగా ఐజేయు సభ్యులందరికీ ఇన్సూరెన్స్ పాలసీ చేయించమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు జంగం విజయ్, అఫ్రోజ్, జిల్లా కార్యవర్గ సభ్యులు సాజిద్ పాషా, బాసెట్టి హరీష్, గౌరవ సలహాదారులు దాసం కిషన్, క్యాషియర్ మక్సూద్, జాయింట్ సెక్రెటరీ పుండ్ర శశికాంత్ రెడ్డి, పింజర్ శివ, ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎండి సమీయుద్దీన్, కార్యవర్గ సభ్యులు పొనగాని మహేందర్, కుర్ర రాజేందర్,రఫీ ఉల్లా, సోహెల్, హైమద్, ముత్యాల రమేష్, బొల్లం రాజు, మాజీ అధ్యక్షుడు ఆగ సురేష్ సభ్యులు ఆదిల్ పాషా, రమణ, ఏసమేని గణేష్, శశి కుమారు, అమ్ముల ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *