పయనించే సూర్యుడు గూడూరు న్యూస్ మే 22 2025-26 విద్యా సంవత్సరం లో పదవ తరగతిలో 480 మార్కులు పైగా సాధించిన యాదవ విద్యార్థిని విద్యార్థులకు నెల్లూరు జిల్లా యాదవ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ప్రతిభ పురస్కారాలు అందజేయనున్నట్లు సంస్థ గౌరవ సలహాదారు మయూరి శ్యామ్ యాదవ్ ,గూడూరు ఓ ప్రకటన లో తెలియ జేశారు. గొలగమూడి రోడ్డు, కొండాయపాలెం, నెల్లూరు నందుగల యాదవ భవన్ నందు 31/5 /2026, ఆదివారం ఉదయం 7 గంటల నుండి నెల్లూరు జిల్లా యాదవ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు అందించబడుతాయన్నారు. నెల్లూరు జిల్లాలో ఉన్న యాదవ విద్యార్థిని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసినది గా కోరారు. ఈ కార్యక్రమంలో యాదవ ప్రముఖులు పాల్గొని విద్య దాని ప్రాముఖ్యత గురించి తెలియజేస్తారు మరియు కెరియర్ గైడెన్స్ పోగ్రామ్ గురించి మర్వాడి యూనివర్సిటీ గుజరాత్ అడ్మిషన్ డైరెక్టర్ శ్రీ హరి కృష్ణ వివరాలు తెలియచేస్తరూ కావున అర్హత కలిగిన యాదవ విద్యార్థిని విద్యార్థులు కింది ఫోన్ నెంబర్ కు తమ మార్కుల లిస్టు కాపీని వాట్సాప్ లో పంపించి పేరు నమోదు చేసుకోవలసినదిగా యాదవ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ గౌరవ సలహాదారులు డాక్టర్ మయూరి శ్యామ్ యాదవ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9948606664