క్షయ వ్యాధి నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం కీలకం

బిజినేపల్లి పీహెచ్‌సీలో న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ సృజన

పయనించే సూర్యుడు మే 22 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ నాగర్‌కర్నూల్, మే 21: క్షయ వ్యాధి నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా క్షయ వ్యాధి ప్రోగ్రాం అధికారి డాక్టర్ రఫిక్ పేర్కొన్నారు. గురువారం బిజినేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని క్షయ వ్యాధిగ్రస్తులకు న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ క్షయ వ్యాధి వచ్చిన వారు భయపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం ఉచితంగా నాణ్యమైన మందులు అందిస్తోందన్నారు. శాస్త్ర సాంకేతిక అభివృద్ధితో క్షయ వ్యాధికి సమర్థవంతమైన చికిత్స అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. ప్రారంభ దశలోనే గుర్తిస్తే వ్యాధి పూర్తిగా నయం అవుతుందని వివరించారు. గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తూ అనుమానిత రోగులకు పరీక్షలు చేస్తున్నామని, నిర్ధారణ అయిన వారికి సకాలంలో మందులు అందిస్తున్నామని చెప్పారు. రోగులు వైద్యుల సూచనల మేరకు మందులను పూర్తిగా వాడాలని సూచించారు. మండల వైద్యాధికారి డాక్టర్ సృజన మాట్లాడుతూ దీర్ఘకాలిక దగ్గు, జ్వరం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా పరీక్షలు, చికిత్స అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో భవిష్య భారత్ జిల్లా మేనేజర్ రమేష్, సూపర్వైజర్లు శ్రీనివాసులు, ఆరిఫ్ ఖాన్, ఆరోగ్య సిబ్బంది గంగా, కోఆర్డినేటర్ బాలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *