పలాస నియోజకవర్గం లో పండగ వాతావరణం

పయనించే సూర్యుడు న్యూస్ మే 23 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. పలాస నియోజకవర్గం ఎమ్మెల్యే గౌతు శిరీష వెంకన్న చౌదరిల వివాహ వార్షికోత్సవం మరియు ఆమె తండ్రి అయిన టిడిపి పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి గౌతు శివాజీ పుట్టిన రోజు ఒకే రోజు కావడంతో శుక్రవారం పలాస నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది.ఈ సందర్భంగా పలుచోట్ల వినూత్న సేవా కార్యక్రమాలను నాయకులు, కార్యకర్తలు చేపట్టారు. వేడుకల్లో భాగంగా స్థానిక రామాలయంలో టిడిపి నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులకు, ప్రజలకు భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.అనంతరం పలాస అన్నా క్యాంటీన్ వద్ద నాయకులు, కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి, ఒకరికొకరు తినిపించుకుంటూ తమ నాయకులకు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా అన్నా క్యాంటీన్‌కు వచ్చిన వారందరికీ ఉచితంగా భోజన వసతి కల్పించి, అన్నదానం చేశారు.సేవా దృక్పథంతో సాగిన ఈ వేడుకల్లో భాగంగా, నాయకులు స్థానిక ప్రభుత్వాసుపత్రిని సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న రోగులకు, వారి సహాయకులకు రొట్టెలు, పండ్లను పంపిణీ చేసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.ఈ సేవా కార్యక్రమాల్లో టిడిపి నాయకులు పిరికఠ్ల విఠల్ రావు, మల్లా శ్రీనివాస్, బడ్డ నాగరాజు, లోడగల కామేశ్వరరావు, సూర్యనారాయణ, గాలి క్రిష్ణారావు, చిన్ని, క్రిష్ణమూర్తి, డి. నర్సింహులు, కె. నర్సింహులు, సత్యం, రామక్రిష్ణ, ఆత్మారావు, జగదీష్‌లతో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *