సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరం- సర్పంచ్ పంజ స్వామి

పయనించే సూర్యుడు జూన్ 14 రాజేష్) దౌల్తాబాద్, జూన్ 13: ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నిరుపేద కుటుంబాలకు వరంగా నిలుస్తోందని గాజులపల్లి సర్పంచ్ పంజ స్వామి అన్నారు. దౌల్తాబాద్ మండలం గాజులపల్లి గ్రామానికి చెందిన బొల్లి లచ్చయ్య (తండ్రి మల్లయ్య)కు మంజూరైన రూ.60 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును శనివారం ఎమ్మెల్సీ యాదవ రెడ్డి సహకారంతో అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ పంజ స్వామి మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందులతో వైద్య చికిత్సలు పొందుతున్న పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో అండగా నిలుస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాశం యేసు, కొలూరి భాస్కర్ రెడ్డి, మార్పాక కనకయ్య, పి. ఎల్లయ్య, గాడి అఖిల్, గొల్లపల్లి రవి, రాములు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *