జగన్నాధపురంలో మొక్కజొన్న ఖాళీ చేను దగ్ధంపొగమంచుతో బోనకల్ రూట్‌లో ట్రాఫిక్‌కు అంతరాయం

పయనించే సూర్యుడు మే 23, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని: మండల పరిధిలోని జగన్నాధపురం గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు మొక్కజొన్న కాళీ చేనుకు నిప్పంటించిన ఘటన స్థానికంగా ఆందోళన కలిగించింది. చేనులో చెలరేగిన మంటలు రోడ్డు పరిసర ప్రాంతాలకు వేగంగా వ్యాపించాయి. దీంతో బోనకల్ వెళ్లే ప్రధాన రహదారిపై దట్టమైన పొగ వ్యాపించి, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్డంతా పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొంతసేపు వాహనాలు నెమ్మదిగా సాగడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. స్థానికులు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *