పయనించే సూర్యుడు న్యూస్ మే 24 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్.పలాస నియోజకవర్గం పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ నర్సీపురం గ్రామంలో గ్రామాభివృద్ధికి మరొక ముందడుగు పడింది.15వ ఫైనాన్స్ కమిషన్ నిధుల ద్వారా మంజూరైన రూ.15 లక్షల రూపాయలు వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు స్థానిక శాసన సభ్యులు గౌతు శిరీష శనివారం నాడు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడం ద్వారా రాకపోకలు సులభతరం అవుతాయని పేర్కొన్నారు. నర్సీపురం గ్రామ అభివృద్ధికి అవసరమైన ప్రతి పనికి తన పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.గ్రామ ప్రజలు కూడా సీసీ రోడ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ మల్లా శ్రీనివాసరావు, బీసీ సెల్ అధ్యక్షులు లోడగల కామేష్ బడ్డ నాగరాజు చిన్ని,మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ అధ్యక్ష, కార్యదర్శులు మరియు ఇతర ముఖ్య నాయకులు, మున్సిపల్ సిబ్బంది స్థానిక ప్రజలు పాల్గొన్నారు.