పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రధాన లక్ష్యం.

మున్సిపల్ చైర్మన్ శ్రవణ్ కుమార్.

పయనించే సూర్యుడు జులై 4 తొర్రూర్ మండలం మహబూబాబాద్ జిల్లా రిపోర్టర్ శ్రీధర్. తొర్రూర్ పట్టణంలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడం తమ ప్రధాన లక్ష్యమని మున్సిపల్ చైర్మన్ శ్రవణ్ కుమార్ తెలిపారు. శుక్రవారం పట్టణంలో విస్తృతంగా పర్యటించారు ఈ సందర్భంగా పగిలిపోయిన డివైడర్లు దెబ్బతన విద్యుత్ స్తంభాలు రోడ్లు నాలాల పరిస్థితిని పరిశీలించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా అవసరమైన మరమ్మతులు వెంటనే చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వి శ్యాంసుందర్, మున్సిపల్ సిబ్బంది స్థానిక ప్రజలు పాల్గొన్నారు

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *