అకాల వర్షానికి కూలిన చెట్లు.. జేసీబీ సహాయంతో ట్రాఫిక్ క్లియర్ చేసిన పాలెం సర్పంచ్

పయనించే సూర్యుడు మే 24 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ ఈరోజు అగ్రికల్చర్ యూనివర్సిటీ సమీపంలోని ఆంజనేయ స్వామి దేవాలయం ముందు అకాల భారీ వర్షం కారణంగా పెద్ద ఎత్తున చెట్లు నేలకూలాయి. దీంతో విద్యుత్ తీగలు తెగి రోడ్డుపై పడటంతో సుమారు రెండు కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ఘటనతో స్థానిక ప్రజలు, ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న వెంటనే పాలెం గ్రామ సర్పంచ్ బోనాసి రామకృష్ణ, ఉపసర్పంచ్ గోవిందు శ్రీనివాసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా జేసీబీ సహాయంతో రోడ్డుపై పడిన చెట్లను తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ, విద్యుత్ శాఖ అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది సమన్వయంతో పనిచేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. స్థానికులు వెంటనే స్పందించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించిన అధికారులకు, ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *