సింగరేణిలో ఉద్యోగాల కుదింపు ప్రక్రియను వెంటనే నిలిపివేయాలి.

ఏఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు చంద్రగిరి శంకర్ డిమాండ్.

పయనించే సూర్యుడు న్యూస్ మే 24 మందమర్రి మండల ప్రతినిధి బొద్దుల భూమేష్. సింగరేణి లో పెండింగ్ లో ఉన్న సింగరేణి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఏమి మాట్లాడక ఏం సమాధానం ఇవ్వలేకపోయిందని సింగరేణి సంస్థ వెంటనే పరిష్కరించాలని ఏఐఎఫ్ టియు రాష్ట్ర నాయకులు చంద్రగిరి శంకర్ డిమాండ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థల్లో గత కొన్ని దశాబ్దాల నుండి 1996 లో లక్ష ఇరవై వేల ఉద్యోగాలు ఉంటే ఇప్పుడున్న పరిస్థితి 2026 లో 36 వేలకు కుదించడం జరిగిందని 80 వేల మంది కార్మికుల జీవితాలను వీధిన పడవేశారని వారికి పెన్షన్ మరియు వైద్య సదుపాయాలు పెరగడం లేదు మెరుగుపరడం లేదని వేలాది మందికి తమపేర్లను మార్చుకునే అవకాశం కల్పించడంలో యజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందని ఎన్నోసార్లు ఉద్యోగుల తొలగింపు సమస్యను యజమాన్యం దృష్టికి తీసుకొచ్చినప్పటికీ దాటవేత ధోరణి అవలంబిస్తూ ఎప్పటికప్పుడు విషయాలను పక్కదారి పట్టిస్తుందని తండ్రి ఉద్యోగాలు రాక ప్రభుత్వాలు ఉద్యోగ అవకాశాలు కల్పించక కుటుంబాల పోషణ గడవక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గత కెసిఆర్ ప్రభుత్వం ఉద్యోగాల కుదింపుప్రక్రియ పరిష్కరిస్తామని హామీ ఇచ్చి పరిష్కరించలేక పోయిందని ఎన్నికలకు ముందు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల ప్రక్రియను పరిష్కరిస్తామని చెప్పి మాట ఇచ్చి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు పరిష్కరించలేక పోయింద నీ బాధిత కుటుంబాలు శాంతియుతంగా సింగరేణి వ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహిస్తూ సింగరేణి ఏరియాల అధికారులకు మరియు కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలకు సింగరేణిలో గెలిచిన కార్మిక సంఘాల నాయకులకు మారుపేర్ల సమస్యలు పరిష్కరించాలని విజ్ఞాపన పత్రాలు ఇస్తూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు అయినా ప్రయోజనం లేకపోవడంతో మా తండ్రి ఉద్యోగాలు మాకు రావని మనస్థాపానికి గురై యువకులు చనిపోవడం జరిగింది అయినా పరిష్కారం లేకపోయింది ఇప్పటికైనా హామీ ఇచ్చి గెలిచినగ సంఘాలు సింగరేణి యాజమాన్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మానవత్వ కోణంలో ఆలోచించి ఉద్యోగాల తొలగింపు వలన బాధిత కుటుంబాలను ఆత్మహత్యల నుండి కాపాడాలని వెంటనే సింగరేణి ఉద్యోగుల ప్రక్రియ సమస్యను పరిష్కరించాలని ఏఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ నాయకులు చంద్ర శంకర్ డిమాండ్ చేశారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *