ఆదోని లో ముందస్తు అడ్మిషన్ల పేరుతో దోపిడీ చేస్తున్న

ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని, డి ఎస్ ఎఫ్ విద్యార్థి సంఘంగా డిమాండ్..

పయనించే సూర్యుడు మే 24 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్. ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి డి ఎస్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ రాష్ట్ర కార్యదర్శి బాలు మాట్లాడుతూ.. ఆదోని పట్టణంలో ప్రభుత్వా నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలలో ముందస్తుగానే అడ్మిషన్లు నిర్వహిస్తూ అలాగే ప్రచారాలు చేస్తూ పాంప్లెట్లు ఫ్లెక్సీలు వేసి పబ్లిసిటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. తల్లిదండ్రులకు విద్యార్థులకు మాయమాటలు చెప్పి మీరు ముందుగానే అడ్మిషన్ చేసుకుంటే మీకు ఫీజు తగ్గిస్తామని మాయమాటలు చెప్పి అడ్మిషన్లు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఆదోని పట్టణంలో ఏర్పడింది. ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలలో ఇంత అక్రమాలు జరుగుతున్న కూడా విద్యాశాఖ అధికారులు మరియు (ఆర్ ఐ ఓ) ఏం చేస్తున్నారని, డి.ఎస్.ఎఫ్ విద్యార్థి సంఘంగా ప్రశ్నిస్తున్నాము. ఇప్పటికైనా అక్రమ ఫీజులను అరికట్టాలి. ముందస్తు అడ్మిషన్ల దోపిడీ పై విచారణ జరపాలి. విద్యార్థులకు తల్లిదండ్రులకు న్యాయం చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతామని మరొక్కసారి ఉన్నత విద్యాశాఖ అధికారులకు హెచ్చరిస్తున్నాము. ఈ కార్యక్రమంలో డిఎస్ఎఫ్ నాయకులు వరుణ్ రాజు తిక్క స్వామి కిరణ్ ఉమాపతి తదితరులు పాల్గొనడం జరిగింది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *