పయనించే సూర్యుడు, కోరుట్ల మే 25 కథలాపూర్ మండలంలోని ఇప్పపెల్లి గ్రామంలో శనివారం ఈత వనం అగ్నిప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది. అగ్నికి ఆహుతైన ఈతవనాన్ని జిల్లా బీసీ సంక్షేమ సం ఘం అధ్యక్షుడు యాగండ్ల రమేష్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్ని ప్రమాదంతో ఈత చెట్ల ఆధారంగా జీవనం సాగిస్తున్న కుటుంబాలు ఒక్కసారిగా ఉపాధిని కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ ఘటన వల్ల దాదాపు 5 ఎకరాల్లో 2 వేల ఈత చెట్లు దగ్ధం అవ్వడంతో సు మారు వంద కుటుంబాల ఆర్థిక పరిస్థితి దెబ్బతినడమే కాకుండా వారి జీవనాధారం పూర్తిగా నాశనమైందని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల చాలాచోట్ల జరుగుతుండడంతో గౌడ కులస్థులు ఆందోళన చెందుతున్నారని ప్రభుత్వం వెంటనే స్పందించి జీవనా ధారం కోల్పోయిన కుటుంబాలకు తక్షణ సహాయం అందిం చడంతో పాటు నష్టపరిహారం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే అగ్నిప్రమాదానికి గల కారణాలను అధికారులు సమ గ్రంగా విచారించి భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.