పయనించే సూర్యడు గూడూరు న్యూస్ మే 26 గూడూరు నియోజకవర్గంలో పలువురు సి ఎం ఆర్ ఎఫ్ కు దరాకస్తూ చేసుకున్నారు. 24వ విడతలో 51 మందికి రూ 13.73 లక్షలు మంజూరయ్యాయి. వీటిని ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అవసరమైన వారికి సీఎంఆర్ఎఫ్ కింద సాయం చేస్తున్నామని చెప్పారు. అనంతరం గూడూరు లో క్లీన్ స్వీప్ప కార్యక్రమంలో భాగంగా ఆదివారం గూడూరు ఆర్టీసీ ప్రాంగణంలో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ఎమ్మెల్యే సునీల్ కుమార్ స్వయంగా చెత్తను శుభ్రం చేశారు. అనంతరం సేకరించిన చెత్తను ట్రాక్టర్ లో లోడ్ చేశారు. ఆర్టీసీ ప్రాంగణంలో గోడల పైన పాన్ పరాక్ ఉమ్మి వేయడం వల్ల మురికిగా మారిన ప్రాంతాలను శుభ్రం చేసి సున్నం వేశారు. ప్రజలు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.