50 శాతం సబ్సిడీపై అందుబాటులో జీలుగు విత్తనాలు

పయనించే సూర్యుడు మే 26 పెద్ద శంకరంపేట్ మండలం మెదక్ జిల్లా (రిపోర్టర్ జిన్న అశోక్) పెద్ద శంకరపేట మండలంలో వానకాలం 2026 పంట కాలానికి రైతులకు 50% శాతం సబ్సిడీపై జీలుగ విత్తనాలు రేపటి నుండి సరఫరా చేయబడును ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నందు అందుబాటులో కలవు 30 కిలోల బస్తా జీలుగ విత్తనాల ధర 2453 రూపాయలు ఇది 2.5 ఎకరాలకు సరిపోతుంది కావున కావాల్సిన రైతులు తమ పట్టాదారు పాసు పుస్తకం ఆధార్ కార్డు తీసుకుని వ్యవసాయ అధికారులను సంప్రదించి ఆన్లైన్ టోకెన్ తీసుకొని సహకారం సంఘం నందు జీలుగు విత్తనాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది ఈ జీలుగా విత్తనాలు 35 నుంచి 45 రోజులు నాటిన తర్వాత పూత వచ్చేముందు భూమిలోనే కలియదున్నాలి దీనివల్ల 12 కిలోల జీవపదార్థం సేంద్రీయ కర్బనంగా నేలకు అంది పంటల ఉత్పాదకత కు ఎంతో దోహదపడుతుంది సూక్ష్మజీవుల వృద్ధి గాలి నీటి నిల్వ శాతం పెరిగి మొక్క ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడుతుంది మరియు రసాయనిక ఎరువుల వాడకం తగ్గుతుంది అలాగే 90 శాతం సబ్సిడీపై జిప్సం కూడా వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు సరఫరా చేస్తున్నాము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *