ఎమ్మిగనూరు ఎం ఎస్ నగర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాల లో వసూళ్లకు పాల్పడిన హెచ్ఏం పై చర్యలు తీసుకోవాలి

ఎమ్ఆర్ఒ కి వినతిపత్రంని అందచేసిన ఆర్ పి ఎస్ ఎఫ్, పి ఆర్ ఎస్ వై ఎఫ్ విద్యార్ధి సంఘాల నాయకులు.

పయనించే సూర్యుడు మే 26 ఆదోని నియోజకవర్గం ప్రతినిధి బాలకృష్ణ. ఎమ్మిగనూరు పట్టణంలోని ఎంఎస్ నగర్‌లో ఉన్న జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో హెచ్‌ఎం పదవ తరగతి విద్యార్థుల దగ్గర ప్రభుత్వం నిర్ణయించిన పరీక్షల ఫీజు కంటే అదనంగా డబ్బులు వసూలు చేయడం జరుగుతోందని, అలాగే టీసీ (టి సి) పేరుతో పేద విద్యార్థుల వద్ద నుండి రూ.300 నుండి రూ.400 వరకు అక్రమంగా వసూలు చేస్తున్నారని ఈ అక్రమ వసూళ్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఈరోజు పి ఆర్ ఎస్ వై ఎఫ్ రాష్ట్ర నాయకుడు రఘునాథ్ మరియు ఆర్ పి ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి షాహిద్ ఆఫ్రిది ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు తహసిల్దార్ శ్రీనివాసులు కి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులపై ఆర్థిక భారం మోపడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్య హక్కు అందరికీ సమానంగా అందాల్సి ఉండగా, ఇలాంటి హెచ్ఎం లు విద్యార్థుల నిరుపేద పరిస్థితిని ఆసరాగా చేసుకొని అదనపు ఫీజులు వసూలు చేయడం అన్యాయమని పేర్కొన్నారు. ప్రభుత్వం విద్యార్థుల కొరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా వివిధ రకమైనటువంటి పథకాలు పెట్టి విద్యార్థులకు ఉచిత విద్య బోధను అందించాలని కష్టపడుతూ ఉంటే ఇలాంటి వారు మాత్రం వారి స్వలాభాల కోసం విద్యార్థులను పీడించడం భావ్యం కాదు అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.హెచ్ఎం ఈ సంవత్సరం మాత్రమే కాకుండా ఆమె పాఠశాలకు ప్రధానోపాధ్యాయులు అయినప్పటి నుండి విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేసి డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది వెంటనే విద్య శాఖ అధికారులు విచారణ జరిపి అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని విద్యార్థులకు తిరిగి చెల్లించి , హెచ్ఎం ని సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమం నాయకులు బాబ, విష్ణు, నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *