వేతన పెంపు హర్షణీయం : కాంగ్రెస్

పయనించే సూర్యుడు మే 22. పాపన్నపేట మండల రిపోర్టర్ దుర్గాప్రసాద్ తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి కి పాల అభిషేకం ఈరోజు పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. అలాగే ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ఇక సీఎం నిర్ణయాలకు మద్దతుగా పలుచోట్ల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాలాభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా కార్మికుల కనీస వేతనాల పెంపు, ఉద్యోగాల వయోపరిమితి పెంపు నిర్ణయాలపై అభిమానులు సంబరాలు చేసుకున్నారు. రాష్ట్రం లోని 1.11 కోట్ల మందికి పైగా కార్మికులకు మేలు జరిగేలా వేతనాల పెంపు నిర్ణయం హర్షనీయమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నరేందర్ గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం పాపన్నపేట మండల కేంద్రం లోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద సీఎం రేవంత్ రెడ్డి,కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి చిత్రపటాలకు,కార్మికులు,కాంగ్రెస్ నాయకులతో కలిసి మండలాధ్యక్షుడు నరేందర్ గౌడ్ పాలాభిషేకం చేశారు. మండల సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షుడు వెంకటేశం తదితరులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *