పయనించే సూర్యుడు జూన్ 12 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ ఇటీవల బదిలీపై వచ్చిన జిల్లా రెవెన్యూ అధికారి ఆర్. పాండును నాగర్ కర్నూల్ టీఎన్జీవో నాయకులు గురువారం నాడు తన చాంబర్లో కలిసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగులు పరిచయ కార్యక్రమం తో పాటు ఆయన జిల్లా ప్రజలకు సేవ చేయుటకు స్వాగతించారు.ఈ కార్యక్రమంలో టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు బావండ్ల వెంకటేష్, కోశాధికారి బాలరాజు, ఉపాధ్యక్షులు కోట్ర బాలాజీ, చెన్నకేశవులు, యూనిట్ అధ్యక్షులు నసిరుద్దీన్, కార్యదర్శి మలిపెద్ది సురేష్ కుమార్,జిల్లా నాయకులు కళ్యాణ్ కృష్ణారావు ,లింగం, రమేష్,,ఏం.ఆనంద్,బుగ్గప్ప, తదితరులు పాల్గొన్నారు.