పయనించే సూర్యుడు జూన్ 12, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) కాకినాడ రూరల్ మండలం ఏపీఐఐసీ ఎదురు మెయిన్ రోడ్డు శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద లో మూడు నెలలు మజ్జిగ పంపిణీ 55వ రోజుకు చేరుకుంది. అలుపెరగని సాయిరాం మీనాక్షి దంపతులు ప్రతిరోజు మండుటెండల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు శ్రీ సద్గురు సాయిబాబా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు సాయిరాం రాంబాబు మీనాక్షి దంపతులు చలివేంద్రం నిర్వహిస్తున్న మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఆదర్శంగా నిలుస్తోంది. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట పంచాయితీ పరిధిలోని భవానీ కాస్టింగ్ సమీప అభయ ఆంజనేయస్వామి ఆలయం వద్ద ప్రతిరోజూ భక్తులు, ప్రయాణికులు, కార్మికులకు చల్లని మజ్జిగను పంపిణీ చేస్తున్నారు.స్వర్గీయ చుండ్రు కొండలరావు జ్ఞాపకార్థం ఆయన సతీమణి చుండ్రు సుబ్బలక్ష్మి ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం మూడు నెలలు నిరంతరంగా కొనసాగుతోంది.వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఉపశమనం కలిగించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతిరోజూ వందలాది మంది ఈ సేవను వినియోగించుకుంటూ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ సద్గురు సాయిబాబా ట్రస్ట్ వ్యవస్థాపకులు సాయిరాం మాట్లాడుతూ, “మానవ సేవే మాధవ సేవ అనే భావనతో మా గురువర్యులు మామిడిపల్లి రామారావు లక్ష్మీ దంపతుల ఆశీస్సులతో ట్రస్ట్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.మండుటెండల్లో ప్రజలకు చల్లని మజ్జిగ అందించడం ద్వారా కొంత ఉపశమనం కలిగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం.దాతల సహకారంతో ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తాం”అని తెలిపారు.ఈ కార్యక్రమంలో రైన్బో కంపెనీకి చెందిన చుండ్రు జానకిరాం, ప్రసాద్, సోమాజి, చిన్న, రాయుడు బాబ్జి, పితాని ప్రసాద్, కంచర్ల సతీష్, మూర్తి, జ్యోతుల కొండలరావు, సరోజినీ, సత్యవతి తదితరులు పాల్గొని సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సమాజానికి ఉపయోగపడే ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తాయని స్థానికులు అభినందించారు. ఈ కార్యక్రమంలో కే సతీష్, చిరంజీవి ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.