గాంధీజీ గ్రామ సమైక్య భవనానికి శంకుస్థాపన చేసిన గొల్లగూడెం గ్రామ సర్పంచ్ కోడూరు ఉమాదేవి వీర కృష్ణ.

కార్యక్రమంలో పాల్గొన్న తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాపా సుధాకర్ బాబు.

పయనించే సూర్యుడు న్యూస్ :మే 26, తల్లాడ రిపోర్టర్ మండల పరిధిలోని గొల్లగూడెం గ్రామపంచాయతీ నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గాంధీజీ గ్రామ సమైక్య భవనానికి గొల్లగూడ గ్రామ సర్పంచ్ కోడూరు ఉమాదేవి వీర కృష్ణ కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు, ఈ సందర్భంగా సర్పంచ్ కోడూరు ఉమాదేవి వీరకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మహిళలు అభ్యున్నత కోసం ఏర్పాటుచేసిన గాంధీజీ గ్రామ సమైక్య భవనం ఎంతోమంది మహిళలకు ఉపయోగకరంగా ఉంటుందని, గ్రామంలో ఉన్న పలు గ్రూపు మహిళా సభ్యులందరూ కూడా భవనాన్ని వినియోగించుకోవలసినదిగా ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాప సుధాకర్ బాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తూ, మహిళలను మరింత అభివృద్ధి పథంలో తీసుకురావటమే ప్రభుత్వ లక్ష్యమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి బీసీ సెల్ అధ్యక్షులు కోడూరు వీర కృష్ణ, సెక్రెటరీ కవిత, సీసీ భద్రమ్మ, ఉపసర్పంచ్ తోటపల్లి నాగలక్ష్మి, వార్డు మెంబర్లు కోడూరు దుర్గారావు, నాయకులు కాపా వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, గ్రామ పెద్దలు ఇలా సాగరపు వెంకటేశ్వరరావు, ఇలా సాగరపు శ్రీనివాసరావు, కాప చిన్న రామారావు,కాపా మహేష్ బాబు, కాపా నరసింహారావు,ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు ఇస్నేపల్లి అశోక్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇశ్నేపల్లి వీరయ్య, పగిడిపల్లి పెద్ద గోపయ్య, సాదా మల్లయ్య, బొగ్గుల పుల్లారెడ్డి,బొడ్డు కృష్ణ,గుండ్ల బాలకృష్ణ, కోడూరు సత్యం,తోటపల్లి కృష్ణ, గొల్లమందల అంజి, ఇశ్నేపల్లి దేవదానం, ఇశ్నేపల్లి తిరుపతిరావు, ఈవో అధ్యక్షులు ఇశ్నేపల్లి సుశీల, గొల్లమందల దేవకరణ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *