తెలంగాణ ప్రభుత్వ విప్ ఐలయ్యకు స్వాగతం పలికిన ఉమ్మిడి

పయనించే సూర్యుడు న్యూస్, మే 26 (ఏలేశ్వరం మండలా రిపోర్టర్ ఏ శివాజీ) : ప్రత్తిపాడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఉమ్మిడి వెంకట్రావు ఏలేశ్వరంలో స్వగృహానికి విచ్చేసిన తెలంగాణ ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలియ్య కు పుష్పగుచ్చం ఇచ్చి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మీడియాతో మాట్లాడుతూ పెళ్లిరోజు సందర్భంగా అన్నవరం శ్రీ సత్యనారాయణమూర్తి దర్శనం నిమిత్తం రావడం జరిగిందని, ప్రతిపాడు నియోజకవర్గ ఇన్చార్జి ఉమ్మిడి వెంకట్రావును కలిసి అన్నవరం బయలుదేరడం జరుగుతుందన్నారు. అలాగే కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి వెంకట్రావు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని అన్నారు. అనంతరం వెంకట్రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విప్ ఇలియ్య పెళ్లిరోజు సందర్భంగా అన్నవరం సత్యదేవుని దర్శనానికి రావడం జరిగిందని, మా ఆతిథ్యాన్ని స్వీకరించి రాత్రి కి అన్నవరంలో బస చేసి ఉదయం దర్శనం అనంతరం తెలంగాణ బయలుదేరి వెళ్లడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో దొంతంశెట్టి చంద్రశేఖర్, వీరబాబు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *