పాలెం అంగన్వాడి కేంద్రంలో గర్భిణీల గురించి వినూత్న కార్యక్రమం.

అంగన్వాడి సూపర్వైజర్ రేణుక.

పయనించే సూర్యుడు మే 26 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల పరిధిలోని పాలెం ఒకటవ అంగన్వాడి కేంద్రంలో సోమవారం “99 రోజుల ప్రణాళిక ప్రగతి” కార్యక్రమం భాగంగా గర్భిణీల ఆరోగ్యంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీల భర్తలతో ప్రత్యేకంగా వంటల పోటీలు నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.. కుటుంబంలో గర్భిణీల ఆరోగ్యం కాపాడటంలో భర్తల పాత్ర ఎంత ముఖ్యమో తెలియజేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని అంగన్వాడి నిర్వాహకులు సూపర్వైజర్ రేణుక తెలిపారు. దీనిలో భాగంగా ఎక్కువ శాతం జంక్ ఫుడ్ కు ప్రాధాన్యత ఇవ్వకూడదని అంగన్వాడి సూపర్వైజర్. తెలిపారు. గర్భిణీలు భోజనం చేసిన తరువాత రెండు గంటలకు వరకు విశ్రాంతి తీసుకుని రాత్రి 8 గంటలకు నిద్రించాలని తెలిపారు పోషకాహారం తీసుకోవడం ద్వారా తల్లి, శిశువు ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్య సిబ్బంది వివరించారు. గర్భిణీలకు అవసరమైన పోషక విలువలు ఉన్న ఆహార పదార్థాలతో భర్తలు స్వయంగా వంటలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. పోటీల్లో పాల్గొన్న పురుషులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని కుటుంబ బాధ్యతల పట్ల తమ చైతన్యాన్ని చాటిచెప్పారు. గర్భిణీలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రక్త పరీక్షలు తప్పకుండా చేయించుకోవాలని అంగన్వాడి సిబ్బంది సూచించారు . దీని ద్వారా గర్భిణీలలో హిమోగ్లోబిన్ శాతం తెలుస్తుందని అన్నారు.రక్తహీనత సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అంగన్వాడి సూపర్వైజర్లతో పాటు వైద్య సిబ్బంది గర్భిణీలకు పలు సలహాలు సూచనలు అందిస్తారని సూచించారు. గర్భిణీలు ప్రతిరోజూ సమతుల్య ఆహారం తీసుకోవాలని, పాలు, గుడ్లు, ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బోనాసి రామకృష్ణ. ఉప సర్పంచ్ గోవింద శ్రీనివాసులు., ఒకటవ మూడవ వార్డు సభ్యులు, రిజ్వానా బేగం,డి పరశురాములు, అంగన్వాడి టీచర్లు రజియా బేగం, ప్రభావతి, శశికళ, విజయలక్ష్మి లు పాల్గొన్నారు. అంగన్వాడి కేంద్రాలలో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించాలని పలువురు కోరారు. గర్భిణీ స్త్రీల ఆరోగ్యం కేవలం మహిళల బాధ్యత మాత్రమే కాదని, కుటుంబమంతా కలిసి చూసుకోవాల్సిన బాధ్యత అన్నారు .వంటల పోటీల్లో పాల్గొన్న భర్తలకు బహుమతులు అందజేసి ప్రోత్సహించారు. పోషకాహారంపై అవగాహన కలిగించేలా ప్రత్యేక ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేశారు.. గ్రామ ప్రజలు కార్యక్రమాన్ని ఎంతో ఆసక్తిగా పరిశీలించారు. ఈ వినూత్న కార్యక్రమం గ్రామంలో మంచి ఆదరణ లభించింది. గర్భిణీల ఆరోగ్య సంరక్షణలో భర్తల భాగస్వామ్యం పెరగాలని పలువురు అభిప్రాయపడ్డారు. కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేస్తూ, ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి ఈ కార్యక్రమం ఆదర్శంగా నిలిచిందని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పాలెం డాక్టర్ కార్యక్రమాన్ని ద్వేషించి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *