కాలపరిమితి దాటిన సహారా ఇండియా డిపాజిట్లను వెంటనే చెల్లించాలి

ఆత్మ హత్యలే శరణ్యం అని సహారా ఇండియా డిపాజిట్ బాధితుల ఆందోళన.

పయనించే సూర్యుడు న్యూస్ మే 28 మందమర్రి మండల ప్రతినిధి బొద్దులభూమేష్. సహారా ఇండియా లో చేసిన ఫిక్స్డ్ డిపాజిట్లకు కాల పరిమితి దాటి పోయి 4-5 సంవత్సరాలు కావస్తున్నా సహారా ఇండియా యాజమాన్యం మా డబ్బులు చెల్లించకపోవడం పట్ల ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో సమావేశమై సహారా బాధితులు కాలపరిమితి దాటిన మా డబ్బులను వెంటనే చెల్లించాలని లేనిచో మాకు ఆత్మహత్యలే శరణ్యం అని,మా ఆత్మ హత్యలకు పూర్తి భాద్యత సహారా ఇండియా యాజమాన్యానిదే అని సహారా బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా 13 కోట్ల మంది సహారా బాధితులు ఉన్నారని,వీరికి రూపాయలు 1,40,000 వేల కోట్లు సహారా యాజమాన్యం చెల్లించాలని కానీ ఇప్పటివరకు సహారా బాధితులకు 5,000 వేల కోట్ల రూపాయలను మాత్రమే వారి డిపోసుట్లు చెల్లించారని,మిగతా సహారా బాధితులందరికీ వారు కట్టిన పాలసీలు మెచ్యూరిటీ పూర్తయిన వారికి కేంద్రంలోని బిజెపి,ఎన్ డి ఏ ప్రభుత్వం వెంటనే స్పందించి ఢిల్లీ లో ఉన్న సెబీ సంస్థ తోటి సంప్రదించి,సహారా డిపాజిట్ దారులకు డబ్బులు చెల్లించె విధంగా కృషి చేయాలని బిజెపి ప్రభుత్వాన్ని ఈ సమావేశంలో పాలసీదారులు విజ్ఞప్తి చేశారు.అదే విధంగా పెద్దపల్లి ఎంపీ శ్రీ గడ్డం వంశీ కృష్ణ స్పందించి సహారా ఇండియా బాధితుల సమస్యను వెంటనే పరిష్కారానికి కృషి చేయాలని సహారా బాధితులు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం,తెలంగాణ ఉద్యమ కారుల ఐక్య వేదిక అధ్యక్షుడు,గజెల్లి వెంకటయ్య,సహారా బాధితులు పులి కృష్ణ , మురహరి,రమేష్,గంగయ్య,రాజన్న,చారి మరియు డిపాజిట్ దారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *