ఎమ్మెల్యే చేతుల మీదుగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత

పయనించే సూర్యుడు న్యూస్, జూన్ 12 (ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ) : గతంలో రూ.100 ప్రీమియంతో తీసుకున్న చంద్రన్న భీమా నేడు ఓ నిరుపేద కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక భరోసాగా నిలిచింది. శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన తెలుగు దేశం పార్టీ నాయకులు బోడపాటి చంటి సోదరుడు త్రిమూర్తులు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా ఆయన కుటుంబానికి చంద్రన్న భీమా ద్వారా మంజూరైన రూ.5 లక్షల ఇన్సూరెన్స్ చెక్కును ప్రత్తిపాడు మండలం పెదశంకర్లపూడి టిడిపి కార్యాలయంలో రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్, రాష్ట్ర టిఎన్టియుసి ఉపాధ్యక్షులు వెన్నా శివ ఆధ్వర్యంలో ఎమ్మెల్య వరుపుల సత్యప్రభ అందజేశారు. ఈ సందర్భంగా వెన్నా శివ మాట్లాడుతూ కేవలం రూ.100తో తీసుకున్న చంద్రన్న భీమా నేడు ఆ కుటుంబానికి పెద్ద అండగా నిలిచిందని, ఇలాంటి సంక్షేమ పథకాల ప్రయోజనాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. అలాగే ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్‌) కింద మచ్చా నాగుకు మంజూరైన చెక్కును కూడా ఎమ్మెల్యే సత్యప్రభ చేతుల మీదుగా అందజేయడం జరిగిందన్నారు. ఈ సందర్బంగా చంద్రన్న బీమా ద్వారా రూ.5 లక్షల సాయం అందడంతో బాధిత కుటుంబ సభ్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభకు, సహకరించిన రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వెన్నా శివకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు సాదనాల లక్ష్మిబాబు, కంచిబోయిన శ్రీను, కొయ్య రమణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *