పయనించే సూర్యుడు జూన్ 14 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ శ్రీ పరాభవ నామ సంవత్సరం అధిక జ్యేష్ఠ మాసం కృష్ణ పక్షం శని త్రయోదశి శనివారంనాడు బీజినేపల్లి మండలం పరిధిలోని నంది వడ్డేమాన్ గ్రామంలో గల శ్రీశనేశ్వర స్వామికి భక్తులచే శని గ్రహదోష నివారణకు స్వామివారికి తిలతైలా అభిషేకలు పూజలు భక్తితో వేదమంత్రచరణల మధ్య జరిగాయి.శ్రీసార్థాసప్త జేష్టమాత సమేత శనేశ్వర స్వామికి శనివారం నాడు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వేలాది భక్తులు ప్రత్యేకంగా తిలతైల అభిషేకాల పూజలు నిర్వహించారు.ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ గవ్వమఠం విశ్వనాథ శాస్త్రి మాట్లాడుతూ ఈ మాసంలో స్వామివారిని కొలిచిన అత్యధిక సంతృప్తి పొంది విశేష ఫలితాన్ని భక్తులకు ఇస్తారని ఆయన అన్నారు. శనివారం నాడు శని త్రయోదశి రావడం ఈరోజు స్వామివారిని పూజించిన సేవించిన వారికి శనీశ్వర స్వామి కృపా కటాక్షాలు కలుగుతాయని అన్నారు. ప్రతి ఒక్కరు జన్మ రిత్యా,గోచార రీత్యా శనిగ్రహ దోష నివారణకు స్వామివారిని శక్తిమేరకు పూజించాలని అన్నారు. ఈ ఆలయంలో గోన బుద్ధారెడ్డి కాలంనాటి బ్రహ్మసూత్రం గల పరమశివునికి భక్తులచే రుద్రాభిషేక పూజలు, అర్చనలు, దీపారాధన నందీశ్వర స్వామి వారికి ప్రత్యేక అర్చనపూజలు భక్తులచే నిర్వహించారు. అనంతరం భక్తులకు వేద ఆశీర్వచనం తీర్థ ప్రసాదాల, అల్పాహారం పంపిణీ చేశారు. ఈకార్యక్రమం లో ఆలయ ఆలయ చైర్మన్ వెల్దండ గోపాల్ రావు,గ్రామ సర్పంచ్ టి.సుగుణమ్మ, కమిటీ సభ్యులు కెంచె రాజేష్, ప్రభాకరచారి, పుల్లయ్య,అడ్వకేట్ వీర శేఖర్ చారి, శ్రీకాంత్ రెడ్డి,ఆలయ ఆర్చకులు శాంతి కుమార్, ఉమమహేశ్వర్,సిబ్బంది గోపాల్ రెడ్డి భక్తులు, మహిళలు పాల్గొన్నారు.