గొడుగుపల్లి సురంపల్లిలో విజయవంతంగా అమ్మ మాట అంగన్వాడి బాట

" పాల్గొన్నవారు సూపర్వైజర్ గిరిజ గ్రామ సర్పంచులు వనజ. స్వప్న "

పయనించే సూర్యుడు మే 31 రాజేష్ దౌల్తాబాద్) దౌల్తాబాద్ మండలం పలు గ్రామాలలో గొడుగుపల్లి& సూరంపల్లి అంగన్వాడి కేంద్రాల్లో అంగన్వాడి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమాన్ని పలు గ్రామాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్లు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యా రంభ సర్టిఫికెట్లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె సూపర్వైజర్ గిరిజ మాట్లాడుతూ వెల్లడించిన ముఖ్యంశాలు. విద్యా రంభ సర్టిఫికెట్ల పంపిణీ అంగన్వాడి స్కూల్ లలో 5 ఏళ్లు పూర్తి చేసుకొని ఆరవ ఏళ్ళ వయసు వచ్చిన పిల్లలను స్కూల్లకు పంపిస్తున్న సందర్భంగా ఈ సర్టిఫికెట్లను వారందరికీ అందజేస్తున్నాము. యూనిఫామ్ పంపిణీ ప్రభుత్వం అందించిన రెండు జతల యూనిఫాములను గ్రామ సర్పంచుల మరియు ఉప సర్పంచ్ సమక్షంలో పిల్లలకు పంపిణీ చేయడం జరిగింది. కొత్త పిల్లల నమోదు 2.5 ఏళ్ల పైబడిన పిల్లలందరినీ అంగన్వాడీ కేంద్రాలలో నమోదు చేయాలని కోరుతున్నాము. విద్య అంగన్వాడి స్కూల్లో 2.5 నుండి 6 ఏళ్ల వయసు గల పిల్లలకు నర్సరీ ఎల్కేజీ యూకేజీ తరగతులను నిర్వహిస్తున్నాము అలాగే పిల్లలకు తెలుగు ఇంగ్లీష్ హిందీ భాషలో విద్యను బోధిస్తున్నాము అని చెప్పడం జరిగింది. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లకు కాకుండా అంగన్వాడి స్కూల్ లకు పంపాలని విజ్ఞప్తి చేస్తున్నాము. అంగన్వాడి స్కూల్ లలో సమగ్ర అభివృద్ధి జరుగుతుందని గ్రామ సర్పంచులు ఉపసర్పందులు వార్డ్ మెంబర్లు మరియు తల్లులు సహకారంతో ఈ కార్యక్రమాలు విజయవంతం గా కొనసాగుతున్నాయని వారు తెలుపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ సూపర్వైజర్ గిరిజ గ్రామ సర్పంచులు మద్దెల వనజ. గంగాధర్ స్వప్న. ఉప సర్పంచ్ దుర్గని దీపిక మధుసూదన్. సెక్రటరీ విద్యాసాగర్ వార్డ్ మెంబర్ మద్దెల భాగ్యలక్ష్మి మల్లేష్. అంగన్వాడి టీచర్ నాగాంజలి. రేఖ. బాలమని. నాగరాణి. రజిని కుమారి. ఆశా వర్కర్లు. బొల్లం రేణుక. కనక లక్ష్మి. ప్రి స్కూల్ పిల్లలు పేరెంట్స్ గ్రామ పెద్దలు గర్భవతులు బాలింతలు తల్లిదండ్రులు చిన్నారులు అంగన్వాడి ఆయలు హాజరు కావడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *