పయనించే సూర్యుడు న్యూస్ :మే 31, ఆదోని రిపోర్టర్ విరుపాపురం గ్రామంలో ఈరోజు (30-05-2026) నిర్వహించనున్న దర్గా కట్టల ప్రారంభోత్సవ కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు వై. జయ మనోజ్ రెడ్డి నీ గ్రామ పెద్దలు, ముస్లిం సోదరులు మరియు స్థానిక ప్రజలు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికి, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై విజయవంతం చేయాలని కోరారు. దర్గా కట్టల ప్రారంభోత్సవం గ్రామంలో సామరస్యానికి, సోదరభావానికి ప్రతీకగా నిలుస్తుందని గ్రామ పెద్దలు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ముస్లిం పెద్దలు, యువకులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు.