కూటమి హామీలపై వైఎస్సార్‌సీపీ శంఖారావం

పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 4 యడ్లపాడు మండల ప్రతినిధి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా..నేటికీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉద్యమబాట పట్టింది. వైఎస్సార్‌సీపీ రాష్ట్రపార్టీ ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరిటా మహా నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా యడ్లపాడు గ్రామంలో గురువారం మండల పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పార్టీ మండల అ«ధ్యక్షుడు వడ్డేపల్లి నరసింహరాజు తెలిపారు. గురువారం ఉదయం 10 గంటలకు యడ్లపాడులోని రాజీవ్‌గాంధీ బొమ్మసెంటర్‌ నుంచి నిరసన ర్యాలీ ప్రారంభమవుతుందన్నారు. వైసిపి మండల అధ్యక్షుడు వడ్డేపల్లి నరసింహరాజు వెల్లడించారు. కూటమి నేతలు నాడు ప్రజలకు ఇచ్చిన సూపర్‌సిక్స్‌ వాగ్దానాలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ, ప్రజా పక్షాన స్థానిక రెవెన్యూ అధికారులకు వినతిపత్రాన్ని సమర్పించ నున్నారు. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి విడదల రజిని హాజరై కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, అన్ని వర్గాల వారిని నిరాశపరిచిన వైనంపై గళమెత్తనున్నారని వివరించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సాగే ఈ నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని, కూటమి సర్కారు వైఖరిని ఎండగట్టేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని నరసింహరాజు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *