57వ రోజు చలివేంద్రం, లస్సి ఫ్రూట్ సలాడ్ పంపిణీ..

పయనించే సూర్యుడు జూన్ 15, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) శ్రీ సద్గురు సాయి బాబా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు సాయిరాం రాంబాబు మీనాక్షి దంపతుల ఆధ్వర్యంలో గత మూడు నెలలు మజ్జిగ ఫ్రూట్ సలాడ్ లస్సి పంపిణీ కార్యక్రమాన్ని ఏపీఐఐసీ మెయిన్ రోడ్డు శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు సాయిరాం రాంబాబు మాట్లాడుతూ దాతలు సహకారంతో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా గత 14 సంవత్సరాలు నుండి పాదాచార్లకు వాహనదారులకు అలాగే బ్లైండ్ స్కూల్ బాలిక బాలుల పాఠశాలల్లో మజ్జిగ లస్సి ఫ్రూట్ సలాడ్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మా గురుదేవులు మామిడిపల్లి రామారావు లక్ష్మీ దంపతుల ఆశీస్సులతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. అలాగే చుండ్రు కొండలరావు జ్ఞాపకార్థం భార్య సుబ్బలక్ష్మి సహకారంతో ఈరోజు హెడ్ కానిస్టేబుల్ వెంకట్ నారాయణ రెడ్డి తన తండ్రి సూరి నారాయణరెడ్డి జ్ఞాపకార్థం మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జ్యోతుల కొండలరావు పులప గంగరాజు స్వామి రాజులు రాయుడు బాబ్జి పితాని ప్రసాద్ చిన్న, కంచర్ల సతీష్, కండపల్లి సతీష్, చిరంజీవి సద్గురు సాయిబాబా ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *