గో రక్ష రథయాత్ర ఇచ్చాపురం నుండి హిందూపురం వరకు ఆరు నెలలపాటు..

మట్టి కొయ్య పోతురాజును ఘనంగా సత్కరించిన ప్రముఖ లాయర్ పులగం రామకృష్ణారెడ్డి..

పయనించే సూర్యుడు జూన్ 15, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) గో రక్షణ కోసం మే ఒకటో తేదీన ప్రారంభమైన రథయాత్ర ఆరు నెలల పాటు కొనసాగి ఇచ్చాపురం నుండి హిందూపురం వరకు జరుగుతుందని హైందవ దళిత సేవ రాష్ట్ర అధ్యక్షులు మట్టి కొయ్య పోతురాజు తెలిపారు. జాతీయ జంతువుగా గుర్తించాలని ఆమోదించాలని. గోవులను ఇబ్బంది పెట్టిన గోవ్యత చేసిన వారిపై కఠిన శిక్షలు ఎంతటి వారినైనా ఉపేక్షించకూడదని అన్నారు. శిక్షలు విధించాలని అన్నారు.ఆదివారం కాకినాడ రూరల్ మండలం మూడో ఏపీఎస్పీ ఆపోజిట్ ప్రముఖ లాయర్ పులగం రామకృష్ణారెడ్డి కార్యాలయంలో ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ గోవ్యత చేయడం మహాపాపమని గోవుల రక్షణ కోసం గో రక్షణ కోసం గత 12 సంవత్సరాలలో ఎంతో కృషి చేస్తున్న మట్టి కొయ్య పోతురాజు సేవల అభినందనీయమని అన్నారు. హిందూ ధర్మాన్ని విశిష్టతను నలుమూలన చాటి చెప్పేందుకు గోరక్ష రథయాత్ర ఎంతో ప్రాముఖ్యమైనదని అన్నారు. దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పితాని సత్యనారాయణ, సభ్యులు నందగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *