డాక్టరేట్ పొందిన శ్రీజను సన్మాణించిన పంచాయితీ పాలకవర్గం!

పయనించే సూర్యుడు న్యూస్ జూన్ /03:నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి :సాయిరెడ్డి బొల్లం :రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామానికి చెందిన డాక్టర్ మీసాల శ్రీజను, తాళ్ళల్ల పల్లె గ్రామ పంచాయితీ పాలక వర్గం ఘనంగా సన్మానించారు.మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ఇటీవల అగ్రికల్చర్ అగ్రనామిలో డాక్టరేట్ పొందిన డాక్టర్ శ్రీజను మరియు ఇటీవల పదవ తరగతి, ఇంటర్ లో ప్రతిభ కనబరిచిన తాళ్ళల్ల పల్లె విద్యార్థులు వర్షిణి, లహరి, నవ్య, ప్రణిత, కొశిని హర్షిత, చరణ్ కుమార్,ఉదయ్ కుమార్ లను సైతం సర్పంచ్ కనకరాజు పాలకవర్గం తరపున శాలువ కప్పి మెమంటోలు అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కనక రాజు మాట్లాడుతూ తాళ్ళల్లపల్లె ప్రాథమిక పాఠశాలలో చదివి నేడు డాక్టరేట్ పొందిన డాక్టర్ మీసాల శ్రీజను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. పదిలో, ఇంటర్ లో ప్రతిభ చూపిన వారంతా ఉత్తమ ఆశయంతో చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన తెలిపారు.అనంతరం డాక్టరేట్ పొందిన డాక్టర్ శ్రీజ స్పందిస్తూ ప్రతి ఒక్కరికి ప్రాథమిక పాఠశాల చదువే పునాదిగా నిలుస్తుందని, ఆ పునాది దృడంగా ఉంటే ఎంతైటి లక్ష్యాన్నైనా చేరుకో గలమని ఆమె తెలిపారు. అనంతరం పదిలో ప్రతిభను చాటిన విద్యార్థులు తమ లక్ష్యాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గొర్ల కమలాకర్, వార్డు సభ్యులు కొలుపుల సందీప్, నేనె కేత శ్రీనివాస్, మీసాల రవీందర్, కామల్ల కవిత, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అధ్యక్షురాలు మీసాల లీల, హెచ్ హెం హరిప్రసాద్, ఉపాధ్యాయులు కోల శ్రీనివాస్ రెడ్డి, అంగన్వాడీ టీచర్ స్వప్న, నాయకులు గుర్రాల రాజయ్య, నూనె శ్రీనివాస్ యాదవ్, కొషిని అంజయ్య, కొలుపుల లక్ష్మణ్, కొలుపుల పెద్ద లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *