పయనించే సూర్యుడు జూలూరుపాడు రిపోర్టర్ గడిదేసి ప్రేమ్ జూన్ 12/26 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని అనంతారం గ్రామ సమీపంలో గురువారం తెల్లవారుజామున ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు నలబండబోడు సమీపంలోని సీతారామ ప్రాజెక్టు కాలువ మట్టిని డాక్టర్ల ద్వారా అక్రమంగా తరలిస్తున్నారు ఈ క్రమంలో మట్టిలోడుతో వేగంగా వెళుతున్న ట్రాక్టర్ ప్రమాదమశాత్తు అదుపుతప్పి అనంతరం గ్రామ సమీపంలోని విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది ఈ దాటికి రెండు విద్యుత్ స్తంభాలు విరిగి ట్రాక్టర్ పై పడ్డాయి అదే సమయంలో విద్యుత్ తీగలు డ్రైవర్ పై పడటంతో ఒక్కసారిగా మంటలు చెల్లరేగాయి ఈ ప్రమాదంలో డ్రైవర్ విద్యుదగాతానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు మంటలు వ్యాపిస్తున్న క్రమంలోనే ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫీజులు కాలిపోయి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పింది తీవ్ర గాయాల పాలైన డ్రైవర్ ని ఖమ్మం ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు గత ఏడాది కాలంగా జూలూరుపాడు మండల పరిధిలోని నలబండబోడు నుంచి చీమలపాడు గుట్టల వరకు సుమారు పది కిలోమీటర్ల మేర ఉన్న మట్టిని ఇష్టారాజ్యంగా అక్రమార్కులు తవ్వేస్తున్నారు