పయనించే సూర్యడు / జూన్ 03/ ఉప్పల్ ప్రతినిధి సింగం రాజు : మల్కాజ్‌గిరి కార్పొరేషన్, కాప్రా సర్కిల్ డాక్టర్ ఎ.ఎస్. రావు నగర్ డివిజన్ రాధిక చౌరస్తాలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డివిజన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సుంకు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జెండాను ఆవిష్కరించి, తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుంకు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చింది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తు చేశారు. అమరుల త్యాగఫలంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి పథంలో నడిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పజ్జురి పావని మణిపాల్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పాకాల రాజన్న, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొత్త అంజిరెడ్డి, అల్లురయ్య, పెద్ది శ్రీనివాస్, అజిజ్, లింగస్వామి, పెద్ది నాగరాజు, ఎస్సీ సెల్ అధ్యక్షులు అనిల్, ప్రకాష్, చౌదరి, నాగేశ్వర్ రెడ్డి, అరుణ్, ఉమేష్ , రాజేష్, పాడాలా శ్రీకాంత్, భవాని, మాధవి, రాధా, శ్రీవల్లి మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు