మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు పదివేల రూపాయల వేతనం ఇవ్వాలి సిఐటియు

పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 12 అశ్వారావుపేట మండలం రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మధ్యాహ్న భోజన పథకం కార్మి కులకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హమీ మేరకు పదివేల రూపాయ లు వేతనం పెంచి అమలు చేయా లని పెరుగుతున్న ధరలను దృష్టి లో పెట్టుకొని విద్యార్థులు మెనూ ఛార్జీలు 25 రూపాయలు పెంచాల ని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ డిమాండ్ చేశారు. బుధవారం మధ్యాహ్నం భోజనం కార్మికుల మండలకమిటి సమావే శం సుందరయ్య భవనశీలో పల్లెల నాగదుర్గ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పిట్టల అర్జున్ మాట్లా డుతూప్రభుత్వపాఠశాలలో విద్యా ర్థులకు వండి పెట్టే మెనూ ప్రస్తుత మార్కెట్ ధరలను బట్టి అమలు చే యలేరని,వంట కార్మికులకు కట్టెలు బిల్లులు గ్యాస్ బిల్లులు రాష్ట్ర ప్ర భుత్వం ఒక పైసా కూడా ఇవ్వటం లేదని ఇప్పటికే కొన్ని పాఠశాలలో తమ సొంత గ్యాస్ బండలు పాఠ శాలలో ఉపయోగిస్తున్నారని ప్రస్తు తం భారీగా పెరిగిన గ్యాస్ ధరలతో పాఠశాలలో గ్యాస్ ఉపయోగించ లేని పరిస్థితి ఉ ందన్నారు. మధ్యా హ్న భోజన కార్మికుల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టలో పెట్టుకొని విద్యార్థుల మెనూ చార్జీలు పెంచా లని, గ్యాస్ బండలు, గుడ్లు ప్రభు త్వమే అంగన్వాడి పాఠశాలలకు ఇస్తున్నట్లు సరఫరా చేయాలని పా ఠశాలల రీఓపెనింగ్ కంటే ముందే ప్రకటించాలని, వంట కార్మికులకు కనీసం వేతనం 26 వేల రూపాయ లు ఇవ్వాలని గుర్తింపు కార్డులు ఇ వ్వాలని, నాణ్యమైన రెండు జతల కాటన్ యూనిఫాంలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో సిఐటియు జిల్లా కమిటీ సభ్యు లు కేసుపాక నరసింహారావు (అశ్వ రావుపేట సిఐటియు మండల కన్వీనర్) ముర హరి మొడియం సీత, నన్నీ, పల్లెల నాగదుర్గ, ఓడ యామిని, వెంకటలక్ష్మి, లీల తదిత రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *