ఉప సర్పంచుల ఫోరం జిల్లా గౌరవ అధ్యక్షునిగా ఉప్పు రాజు

పయనించే సూర్యుడు మే 24 వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండల కేంద్రం వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం చెందిన ఉప సర్పంచ్ ఉప్పు రాజు జిల్లా ఉప సర్పంచుల ఫోరం గౌరవ అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర ఉప సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షులు బోట్ల కార్తీక్ తెలిపారు. రాష్ట్ర ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులు లావుడ్యా రాములు నాయక్ ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఉప్పు రాజు మాట్లాడుతూ తన పై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని ఉప సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ముందుండి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని వివిధ గ్రామాల ఉప సర్పంచులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *