వర్షాల పట్ల అధికారులు జాగ్రత్తలు వహించాలి.మండల అభివృద్ధి అధికారి పల్లి భాగ్యశ్రీ.

పయనించే సూర్యుడు మే 28 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూరు. వర్షాల పట్ల అధికారులు జాగ్రత్తలు వహించాలని మండల అభివృద్ధి అధికారి పల్లి భాగ్యశ్రీ కోరారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం ఆమె మండలాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారులు ముందస్తు గాలి దుమారాలు, వర్షాల వల్ల వాగుల వద్ద పాటించే జాగ్రత్తలను పాటించాలన్నారు. గ్రామపంచాయతీ కార్యదర్శి, సిబ్బంది ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె కోరారు. పంచాయతీ కార్యదర్శులు గ్రామాలలో ఇంటింటికి తిరిగి విద్యుత్ షాక్ ల వల్ల కలిగే నష్టాల గురించి వివరించాలని కోరారు. విద్యుత్ అధికారులు విద్యుత్ పోల్స్ వద్ద జాగ్రత్తలు వహించాలని అన్నారు. మిషన్ భగీరథ అధికారులు మంచినీటి సరఫరాను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి మంచినీటి సౌకర్యాన్ని ఎక్కడ ఆటంకం కలిగించకుండా చూడాలని కోరారు. మండల ప్రజలు వర్షాలు వల్ల వాగులు, చెరువుల వద్దకు వెళ్ళరాదని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శేషగిరిరావు, ఎంపీఓ జీవీఎస్ నారాయణ, ఎంఈఓ నాగిరెడ్డి, పిహెచ్సి వైద్యులు బాలకృష్ణ, ఏవో నరసింహారావు, పంచాయతీరాజ్ ఏఈ సూర్యనారాయణ,ఐసిడిఎస్ సూపర్వైజర్లు భవాని, బక్కమ్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *