పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మే 28 జగ్గయ్యపేట పట్టణ ప్రజలకు కరెంటు కష్టాలు దీనికి కారణం జగ్గయ్యపేట చిల్లకల్లు సబ్ స్టేషన్ల ఉన్నతాధికారుల నిర్లక్ష్యమే ఈ కరెంటు ఇబ్బంది. ఎందుకనగా నియోజకవర్గ స్థాయిలో స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా ప్రభుత్వం ఉత్తరువులు జారీ చేసి ఇటీవల కాలంలో వందల కోట్ల రూపాయలు అభివృద్ధి చేస్తున్నామని గౌరవ శాసనసభ్యులు మున్సిపల్ చైర్మన్ మాటలకే పరిమితం అయ్యారు క్షేత్రస్థాయిలో అధికారులు రాజకీయ నాయకుల ఒత్తిడి మేరకు కరెంటు పనులు స్తంభాలు ఏర్పాట్లు వారి కనుసన్నల్లో పనులు చేస్తా ఉన్నారు సామాన్య ప్రజల కష్టాలు తీర్చేవారు ఎవరు జగ్గయ్యపేట పట్టణంలో నిన్న రాత్రి అనగా మంగళవారం రాత్రి 11 గంటల నుంచి గాలి తుఫాను కారణంగా విద్యుత్ స్తంభాలు కూలిపోయి చెట్లు విరిగిపోయి పట్టణంలోని ప్రజలందరూ విద్యుత్ సరఫరా నిలిచిపోయి ఎండ ఒక్కపోతకు తట్టుకోలేక ఇళ్ల నుండి బయటకు వచ్చి కూర్చొని కరెంటు కోసం ఎదురుచూపులు చూస్తున్న పరిస్థితి కనీసం ప్రజలకు అవగాహన కల్పించడం కరెంటు ఎప్పుడు వస్తుంది అని కూడా తెలియజేయకపోవడం బాధాకరం ఈరోజు బుధవారం సాయంత్రం 6:00 అయినా కూడా కరెంటు రాలేదు అంటే 24 గంటలు పట్టణ ప్రాంతంలో కరెంటు లేకుండా నివసించడం అంటే నీళ్ళు అదేవిధంగా, లైట్లు ఫ్యాన్లు వంటివి లేకుండా ఈ ఎండాకాలంలో భయంకరమైనటువంటి వాతావరణాన్ని ప్రజలు చవిచూశారు కూటమి ప్రభుత్వంలో నాయకులు అధికారులు సమన్వయం లోపంతోనే ఈ నష్టం జరిగింది ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు గంటల్లోనే సమస్యని తీర్చి ప్రజలకు అందుబాటులో ఉంచాలి,ఒకపక్క కరెంటు చార్జీలు పెంచడం మినిమం మెయింటెనెన్స్ లేకపోవటం వలన ఈ దౌర్భాగ్యం ఏర్పడినది. అధికారులు, సిబ్బంది కేవలం ఏసీ గదిలో కూర్చొని ప్రజలు ప్రాణాలు అంటే లెక్క లేకుండా ఉండటమే ఈ దుస్థితి. జిల్లా అధికారులైన స్పందించి స్థానికంగా పనిచేయనటువంటి అధికారుల పనితీరుపై వెంటనే విచారణ జరిపి వారిపై నిర్లక్ష్యం ఉన్న ఎడల చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ డీఈని ఫోన్లో సమస్యను తెలియజేయడం జరిగింది రాత్రి నుంచి పసిపిల్లలు తింటానికి తిండి లేక వారికి సరైన వసతి కల్పించలేక తల్లిదండ్రులు గగ్గోలు పెడుతున్నారు. ఈ రాత్రికి కరెంటు వస్తుందా లేదా అనే భయంతో పేట ప్రజలు బిక్కుబిక్కుమని ఎదురుచూస్తున్నారు కావున ఈ రాత్రికి కరెంటు ప్రజలకి వచ్చే విధంగా ఉన్నతాధికారి చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నాను వట్టెం మనోహర్ మున్సిపల్ కౌన్సిలర్ జగ్గయ్యపేట